ప్రభు యేసు సమాచారం

ప్రభు యేసు సమాచారం ప్రకటింతమురారండి శ్రీయేసు సువిశేషం – వివరింతము వినరండీ

1. పాపుల రక్షించుటకై – ప్రభులోకమునకు వచ్చెన్ పాపములను భరియించే పలు శ్రమలను సహియించే ॥ప్రభు॥

2. ప్రయాసపడి భారం మోసికొను ప్రజలారా ప్రభుయొద్దకి రారండి – ప్రశాంతినిపొందండి |ప్రభు॥

3. నేనే మార్గము సత్యం – నేనే జీవంబనెను నా ద్వారా తప్ప ఎవరు నా తండ్రిని జేరడనెన్ ॥ప్రభు॥

4. ఏ భేదమంబునులేక చేసిరి అందరు పాపం దేవుడను గ్రహించిన – మహిమను పొందక పోయిరిగా ||ప్రభు||

5. పాపమునకు జీతంబు-పరిపాటియే మరణంబు ప్రభున్ నమ్మినవారికి – ప్రాప్తించును జీవంబు ప్రభున్ నమ్మనివారికి తప్పదుగా నరకంబు ||ప్రభు||