మా దేవా నీదు కరుణ హస్తము
పల్లవి : మా దేవా నీదు కరుణాహస్తము – మాకు తోడుగ ఉన్నది మా యేసు నీదు కృపాబలము మాకు నీడగ ఉన్నది.
1. సారి సారి ఎజ్రాభక్తుడు – సాక్ష్యమిచ్చెను నీతోడు దేవా నీ కన్నులు మా మీద నుంచి దివ్య జ్యోతిని వెలిగించుమా ॥మా దేవా॥
2. అంత్యదినములలో ఆత్మనొసంగెను తన భక్తులను బలపరచుటకై దినదినము మాకు దివ్యజ్ఞాన మొసగి నూతన శక్తిని కలిగించుమా ||మా దేవా॥
3. సాతాను జయించు సాధనము సారెసారెకు వాక్యం పఠియించుము – పాపమువలన బలహీనులైతిమి – ప్రార్థనచేతుము పట్టుదలతో ||మా దేవా॥
4. దేవా నీ హస్తము మాకాశ్రయము నిను నమ్మితిమి మాలో నివసింపుము పౌలుకు తన బలము – ప్రభుక్రీస్తేయని పాటించి చాటించే తన సాక్ష్యము ॥మా దేవా||
