కీర్తనీయుడైన యేసు

కీర్తనీయుడైన యేసు – కీర్తింతును ప్రేమతో మాననీయుడైన యేసున్ మదిలో తలచి పూజ సేతు ॥కీర్త॥

1. మధుర మధుర గీతములతో-మాన్యుడేసున్ కీర్తింతున్ తల్లిప్రేమ కన్న మిగుల – హెచ్చైనది యేసుప్రేమ ॥కీర్త॥

2. నమ్ముకొనుము నాదుడేసున్ నిన్ను కనికరించును దిక్కుమాలిన నీయింట – దీనుడై వసియించును ॥కీర్త॥

3. మహామహుడు మహోన్నతుడు – మార్గమతడు పాపికీ సత్యమతడు జీవమతడు – నిత్యరాజ్యము జేర్చునతడు ॥కీర్త॥

4. మనపాప భారము బాప మరణించెను సిలువలో ప్రజలెల్లరు జూచుచుండ – పరముకేగె ప్రభువు యేసు ||కీర్త॥

5. తిరిగి వచ్చి తీర్పుజేయు – సింహాసనాసీనుడై పాపమందు నిల్చువారిన్ పడవేయును నరకమందు ॥కీర్త॥