ఆకాశములు దేవుని మహిమను

ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన పనిని ప్రచురించుచున్నది

1. యేసయ్యా! నీ ఉపమానంబులు కృపతో కూడినవి ధరలో నుండెడి నీ దాసులకు – ధన్యతగూర్చినవి ॥ఆకాశ॥

2. యేసయ్యా! నీ శాసనములు విశ్వసింప తగినవి భాసురముగ మాకెల్లరకు – జ్ఞానము పుట్టించినవి ॥ఆకాశ॥

3. యేసయ్యా! నీ ఉపదేశములు నిర్దోషమైనవి యేసురాజు మా హృదయంబులనవి-సంతోషపరచినవి ॥ఆకాశ॥

4. యేసయ్యా! ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది నీసువార్త నిత్యము మా కన్నులు-వెలిగించుచున్నవి ||ఆకాశ||

5. యేసయ్యా! మీ యందలి భయము పవిత్రమైనది దోషులమము నిర్దోషులజేసి నిత్యము నిలపినది ||ఆకాశ||

6. యేసయ్యా! మీ న్యాయ విధులు బహుసత్యంబైనవి విస్తారమేలిమి బంగారుకన్న – కోరుకొనదగినవి ||ఆకాశ||