ఆత్మతో సత్యముతో
ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధింతుము ఆనందింతుము
1. నీ శరీరం రొట్టొవలెనె-నిజముగ విరువంగబడెను నిన్ను తినెడి భాగ్యమిచ్చి-నన్ను మన్నించితివిగా ||ఆత్మ॥
2. పాపపరిహారముకై – ప్రభువా మరణించితివి చావుని తొలగించి నన్ను సజీవునిగ మార్చితివిగ ॥ఆత్మ॥
3. నాయతిక్రమమువలన నలుగగొట్టబడితి వీవు నారోగములను భరించి – నన్ను స్వస్థపరచితివిగ ॥ఆత్మ॥
4. నిశ్చయముగ అన్యాయము నిసుమంతయు గానరాదు పాపమంత కడిగివేసి పరలోకము చేర్చితివిగ ||ఆత్మ॥
5. ఏమి నేను చెల్లింతును ఎటుల రుణము తీర్చుకొందు నా హృదయ పూర్వకముగా నా స్తుతులను చెల్లించును ||ఆత్మ॥
